రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2023-09-20T00:40:29+05:30 IST

మండలంలోని తిమ్మాపూర్‌ వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కొత్తూర్‌, సెప్టెంబరు 19: మండలంలోని తిమ్మాపూర్‌ వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌లోని నెహ్రుకాలనీకి చెందిన యాదయ్య మహేశ్వరంలోని ఓ వెంచర్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కాగా, సోమవారం ఆయన స్టేషన్‌తిమ్మాపూర్‌ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని మరొకరు..

నందిగామ, సెప్టెంబరు 19 : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మండల సమీపంలోని నూజివీడు సీడ్స్‌ పరిశ్రమ వెనుక ఉన్న రైలు పట్టాలపై స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.

Updated Date - 2023-09-20T00:40:29+05:30 IST