Share News

మహేశ్వరం ప్రజల చూపు.. కాంగ్రెస్‌ వైపు

ABN , First Publish Date - 2023-11-20T00:14:09+05:30 IST

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహేశ్వరం మండలంలోని మొహబత్‌నగర్‌, తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మహేశ్వరం ప్రజల చూపు.. కాంగ్రెస్‌ వైపు
మహేశ్వరం : మొహబత్‌నగర్‌కు చెందిన బీజేపీ నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న కేఎల్లార్‌

మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం, నవంబరు 19 : మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహేశ్వరం మండలంలోని మొహబత్‌నగర్‌, తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేఎల్లార్‌ వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు బీఆర్‌ఎస్‌ పానలను విసుగు చెందారని, మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళకు ప్రతీ నెల రూ.2,500, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు చెప్పారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీకి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాలుకురూ. 500 బోనస్‌ అందించనున్నట్లు చెప్పారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు, ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు, ఉద్యమ కారులకు 250 చదరపుగజాల ఇంటి స్థలంను పంపిణీ చేస్తామని చెప్పారు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5 లక్షలు, విద్యాభరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, చేయూత కింద నెలవారీ పింఛన్‌ 4 వేలు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల భీమా కల్పించనన్నట్లు చెప్పారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ, బీఆర్‌ఎలు దేశాన్ని, రాష్ర్టాన్ని దోచుకుతిన్నారని విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు, సోనియా గాంధీ చొరవతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని ఇకనుంచి దొరల పాలనకు చరమగీతం పాడడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 30 జరగబోయే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మహేఽశ్వరంలో కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం వస్తుందని ఏ గ్రామానికి వెల్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి జేజేలు పలుకుతున్నారన్నారు. అంతే కాకుండా బీజేపీ బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు ప్రతి రోజు స్వచ్చందంగా తరలివచ్చి కాంగ్రెస్‌ లో చేరడం ఎంతో అభినందనీయమని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపు ఎంతో దూరంలో లేదని ఇక బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఇంటిబాట పట్టకతప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మాజీ ఎంపీపీ కె. రఘుమారెడ్డి, కాకిఈశ్వర్‌ ముదిరాజ్‌, అవుల యాదయ్య, హేమ్లానాయక్‌, వెంకట్‌రెడ్డి, విష్టువర్ధన్‌రెడ్డి, జాన్‌, ప్రవీణ్‌, రమేష్‌, షఫీ, జానకీరామ్‌, రాజెందర్‌ తధితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణను సర్వనాశనం చేసిన బీఆర్‌ఎస్‌

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో నాయకులు సర్వనాశనం చేశారని ఆల్‌ ఇండియా యూత్‌ కాంగ్రెస్‌ మీడియా విభాగం ఇన్‌చార్జి చేతన్‌గోనాయక్‌ అన్నారు. ఆదివారం తుక్కుగూడలోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ గెలుపునకు మద్ధతుగా జిల్లా అద్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి లతో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. 1200 మంది బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగిందని, ఇకనుంచి అలా కాకుండా అందరికీ న్యాయం జరిగేలా.. కాంగ్రెస్‌ పాలన వచ్చేలా యువత ఆలోచించి ఓటు వేయాలన్నారు. శైలేంద్ర, శివరామకృష్ణారెడ్డి, హమూది తదితరులున్నారు.

కేఎల్లార్‌కు ఒక్కసారి అవకాశమివ్వండి

కందుకూరు : కేఎల్లార్‌కు ఒక్కసారి అవకాశమివ్వండని, కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదలకు కొడంత అండగా ఉంటుందని కేఎల్లార్‌ తనయుడు అనురూప్‌ రెడ్డి మండల ప్రజలను కోరారు. ఆదివారం మండల పరిదిలోని దాసర్లపల్లి, నేదునూరు, చిప్పలపల్లి తదితర గ్రామాలకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులు అనురూ్‌పరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ గతంలో మహేశ్వరంలో కాంగ్రెస్‌ మరింత బలంగా ఉండేదని... ఎన్నికలు సమీపిస్తుండడంతో మరింత బలపడిందన్నారు. నేదునూరులో జిల్లా నాయకులు జి.ప్రభాకర్‌రెడ్డి, ఎండి అప్జల్‌బేగ్‌, పరమే్‌షల ఆద్వర్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కే ంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామస్తులకు వివరించారు. మండల, యూత్‌ కాంగ్రెస్‌, నాయకులు వెంటకటే్‌షగౌడ్‌, పి.సిద్ధేశ్వర్‌గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, నవీన్‌, శ్రీను నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి

పహాడిషరీఫ్‌ : ముస్లింలు అభివృద్ధి చెందింది కాంగ్రెస్‌ హయాంలోనేనని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఆదివారం జల్‌పల్లి మున్సిపాలిటి లోని శ్రీరామ్‌ కాలనీ నుంచి ర్యాలీ ప్రారంభించి, జల్‌పల్లి, పహాడిషరీఫ్‌, తదితర బస్తిలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్ల వద్ద ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ముస్లింలకు మోసం చేశాడన్నారు, పనేండు శాతం రిజర్వేషన్‌ ఇస్తానని ప్రకటించి పది సంవత్సరాలు అవుతున్నా నేటికీ అమలు చేయలేదన్నారు, అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న జలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలన్నారు, తొమ్మిదేళ్లుగా తెలంగాణను పాలిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధిని విస్మరించిందన్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయన్నారు. పేదల సంక్షేమం కోసం పాటు పడే కాంగ్రె్‌సను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగనుందన్నారు. నాయకులు, మస్నా రవికుమార్‌, నవీన్‌గౌడ్‌, తన్వీర్‌, షాకేర్‌ తదితరులున్నారు.

కాంగ్రెస్‌ గెలిస్తే ఆరు గ్యారంటీల అమలు

సరూర్‌నగర్‌/ఎల్‌బీనగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు ప్రసరించనున్నాయని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంతో పాటు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేయనున్నామని, గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌కు మద్ధతుగా ఆదివారం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ అల్మా్‌సగూడ 26వ డివిజన్‌లోని శ్రీశ్రీహోమ్స్‌లో యూత్‌ కాంగ్రెస్‌ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిగిరింత మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. ఓటర్లు హస్తం గుర్తుకు ఓటేసి కేఎల్లార్‌ను గెలిపించాలని కోరారు. రమేశ్‌నాయక్‌, సంధ్య, కళావతి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ పాలనకు ముగింపు తథ్యం

వచ్చే ఎన్నికలతో రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు ముగింపు తప్పదని, కాంగ్రెస్‌ అధికారం దక్కించుకోవడం ఖాయమని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అమృతానాయుడు అన్నారు. మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌ను గెలిపించాలని కోరుతూ బడంగ్‌పేట్‌లోని పలు కాలనీల్లో మహిళా నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలు పంచుతూ.. చేయి గుర్తుకు ఓటేసి కేఎల్లార్‌ను గెలిపించాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వందరోజుల్లో.. వాగ్ధానం చేసిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఆర్‌కేపురం డివిజన్‌ మహిళా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు తమలపాకుల హర్షలత చెప్పారు. లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆర్‌కేపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళా కాంగ్రెస్‌ నేతలు శకుంతల, శిరీషచౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:14:10+05:30 IST