గనులు, సమాచారశాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-08-24T23:18:46+05:30 IST

ఐదేళ్ల తర్వాత మరోసారి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి వరించింది. తెలంగాణ రాజ్‌ భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమక్షంలో గవర్నర్‌ తమిళిసై మహేందర్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

గనులు, సమాచారశాఖ  మంత్రిగా మహేందర్‌రెడ్డి

ఐదేళ్ల తర్వాత మళ్లీ మంత్రి హోదా

శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎంపీ,ఎమ్మె ల్యేలు,

తాండూరు, ఆగస్టు 24: ఐదేళ్ల తర్వాత మరోసారి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి వరించింది. తెలంగాణ రాజ్‌ భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమక్షంలో గవర్నర్‌ తమిళిసై మహేందర్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవానికి బంధువులు, కుటుంబసభ్యులకు 150 మంది వరకు పాస్‌లు జారీ చేశారు. మహేందర్‌రెడ్డి సతీమణి వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, కూతురు మనీషా, కుమారుడు రినీ్‌షరెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం కుటుంబసభ్యులతో మహేందర్‌రెడ్డి, గవర్నర్‌ తమిళసై సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా గనులు, సమాచార శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ , కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేష్‌రెడ్డి తదితరులు కలిశారు. బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే తాండూరు నుంచి గతలంలో ఎం.మాణిక్‌రావు 13 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్‌, సమాచార శాఖ, మునిసిపల్‌ వాణిజ్య పన్నులు శాఖలు నిర్వహించగా, ఆయన సోదరుడు స్వర్గీయ చంద్రశేఖర్‌ అటవీ, బీసీ సంక్షేమ శాఖలను నిర్వహించారు. తర్వాత మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పని చేయగా తిరిగి మళ్లీ ఆయనకు ప్రస్తుతం గనులు, సమాచార శాఖలు కేటాయించారు.

Updated Date - 2023-08-24T23:18:46+05:30 IST