మెట్రోతో షాద్‌నగర్‌కు మహర్దశ
ABN , First Publish Date - 2023-08-02T00:19:10+05:30 IST
హైదరాబాద్ నుంచి మెట్రో రైలును విస్తరిస్తే షాద్‌నగర్‌కు మహర్దశ వరిస్తుందని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు.
షాద్‌నగర్ అర్బన్/కొత్తూర్/ఆమనగల్లు/కేశంపేట, ఆగస్టు 01:హైదరాబాద్ నుంచి మెట్రో రైలును విస్తరిస్తే షాద్‌నగర్‌కు మహర్దశ వరిస్తుందని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఏర్పాటు చేయబోతున్న మెట్రోను కొత్తూర్ మీదుగా షాద్‌నగర్‌కు విస్తరించడానికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. షాద్‌నగర్ చౌరస్తాలో టపాసులను కాల్చి, కేసీఆర్, కేటీఆర్‌లకు జిందాబాద్‌లు కొట్టారు. వైస్ చైర్మన్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చైర్‌పర్సన్ లావణ్యదేవేందర్‌యాదవ్, వైస్‌ఛైర్మన్ డోలి రవీందర్, బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, లింగంనాయక్, మెండె కృష్ణ, నర్సింహ్మారెడ్డి, యాదయ్య, జనార్ధన్‌చారి, సాయిలు, గోవింద్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. మెట్రో రైలుతో షాద్‌నగర్ ప్రాంతానికి రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుందని కేశంపేట జడ్పీటీసీ విశాలశ్రవణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈమేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మెట్రో సేవలను కడ్తాల పొడిగించాలి
ఆమనగల్లు : మెట్రో సేవలను కడ్తాల మండల కేంద్రం వరకు పొడగించాలని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు మంగళవారం వినతి పత్రాలు పంపారు. కడ్తాల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగిస్తుంటారని వినతి పత్రంలో పేర్కొన్నారు. తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు పొడిగింపునకు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని అన్నారు.