తెల్ల రేషన్ కార్డుదారులకే ‘మహాలక్ష్మి’ని వర్తింపజేయాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:33 PM
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలని ధర్మసమాజ్ పార్టీ నాయకులు అన్నారు.
ధర్మసమాజ్ పార్టీ నాయకులు
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 18 : మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలని ధర్మసమాజ్ పార్టీ నాయకులు అన్నారు. తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నవారికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈమేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతిహొలికేరీకి కలెక్టరేట్‌లో నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఎన్నో అనర్థాలున్నాయని, హేతుబద్ధంగా ఉచిత ప్రయాణాన్ని సవరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేద మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణం వల్ల ధనవంతులు కూడా ప్రయాణం చేస్తున్నారని, దీనివల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వచ్చే అవకాశముందన్నారు. కాగా, ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వారికి నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సహకారం అందివ్వాలని కోరారు. వినతి చేసినవారిలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు రవీంద్ర మహరాజ్, భిక్షపతి మహరాజ్, జిల్లా నాయకులు రాకేష్, నర్సింహ, స్టాలిన్ రవీంద్ర, నాగార్జున, భవానీ, శేఖర్, మహేష్, కిషన్, రాజు, రాకేష్, శ్రీకాంత్, సురేందర్, భాస్కర్ తదితరులున్నారు.
‘ప్రైవేటు రవాణా’ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
శంషాబాద్ : ప్రైవేటు రవాణా కార్మికుల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ బీఎంఎస్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు సోమవారం శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ బీఎంఎస్ ఆటో అండ్ ట్యాక్సీ యూనియన్ నాయకుడు నందకిషోర్ మాట్లాడుతూ మండల కేంద్రాల నుంచి వివిధ గ్రామాలకు, నగరాల్లో వివిధ ఏరియాలకు ప్రజలు ఆటోలలో ఎంతో మంది ప్రయాణించేవారని తెలిపారు. వీరిలో 70 మహిళలే ఉండేవారని అన్నారు. అయితే, ఈ నెల 9 నుంచి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని తెలిపారు. బీఆర్‌ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలు నిర్లక్ష్యం చేస్తూ ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలను ప్రోత్సహించి ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసిందనే భావనతో డ్రైవర్లు ఈసారి కాంగ్రె్‌సకు ఓటువేశామని, ఇప్పుడు పుండుపై కారం చల్లిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తెచ్చిందని ఈ సందర్భంగా వారు వాపోయారు. అంతకుముందు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఆటో అండ్ ట్యాక్సీ డైవర్ల సంఘం అధ్యక్షుడు చింతల నందకిషోర్, ఎండీ. సయ్యద్, రవి, సలీం, నర్సిహగౌడ్, జగదీష్, శివ, శ్రీనివా్‌సరాజు, ఫిరోజ్, ఫయ్యాజ్, రంజిత్, లడ్డూ, కృష్ణ,శ్రీను, దర్శణ్, శ్రీశైలం, రమేష్, మహేష్, వెంకట్‌రెడ్డి, రాములు, ప్రభాకర్, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.