ఖో-ఖో క్రీడను ఆదరించాలి

ABN , First Publish Date - 2023-06-02T23:49:49+05:30 IST

ఖో-ఖో క్రీడను ఆదరించాలని విజ్ఞానభారతి ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ గౌతంరావు తెలిపారు.

ఖో-ఖో క్రీడను ఆదరించాలి
క్రీడాకారులను అభినందిస్తున్న వీబీఐటీ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ గౌతంరావు

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 2: ఖో-ఖో క్రీడను ఆదరించాలని విజ్ఞానభారతి ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ గౌతంరావు తెలిపారు. నగరంలోని హితం ఇంజనీరింగు కళాశాలలో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో మండలంలోని వీబీఐటీ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా శుక్రవారం ఆయన కళాశాలలో అభినందిచారు. ఈ కార్యక్రమంలో వీబీఐటీ కళాశాల డైరెక్టర్‌ మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ పీవీఎస్‌ శ్రీనివాస్‌, పీడీ డాక్టర్‌ ఎం.శ్రీనివా్‌సరెడ్డి, శివలాల్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:49:49+05:30 IST