జీవో 317తో నష్టం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:12 PM
జీవో-317 అమలుతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగిందని సేవ్ రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యులు సేవ్ రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యులు మధుకర్‌రెడ్డి, బొడ్డు రవి, కె.శ్రీనివాస్, శంకర్ నాయక్, కె.శ్రావణ్‌కుమార్, సురేష్, టి.శ్రీనివా్‌సరెడ్డి, రమే్‌షగౌడ్, గణేష్, జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.
సేవ్ రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యులు
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 17 : జీవో-317 అమలుతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగిందని సేవ్ రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యులు సేవ్ రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యులు మధుకర్‌రెడ్డి, బొడ్డు రవి, కె.శ్రీనివాస్, శంకర్ నాయక్, కె.శ్రావణ్‌కుమార్, సురేష్, టి.శ్రీనివా్‌సరెడ్డి, రమే్‌షగౌడ్, గణేష్, జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హస్తినాపురంలోని టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 317జీవోతో జరిగిన నష్టాన్ని వివరించారు. గతంలో ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలుగా ఏర్పాటు చేసిందన్నారు. కొత్త రంగారెడ్డి జిల్లాలో మహబూబ్‌నగర్‌లోని 10 మండలాలను కలిపారని, ఈ సందర్భంలోనే జీవో 317లో స్థానికతను పక్కన పెట్టి కేవలం సీనియారిటీ ఆప్షన్ తీసుకొని హడావిడిగా అర్ధరాత్రుళ్లు అర్డర్లు ఇచ్చారని వాపోయారు. వేలాది ఫిర్యాదులొచ్చినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా 2021 డిసెంబరు 21న కేటాయింపులు చేశారని తెలిపారు. స్థానిక ఉపాధ్యాయులను బయట జిల్లాకు పంపి అన్యాయం చేశారని, మరో వైపు రంగారెడ్డి జిల్లాకు 317జీవోను అడ్డం పెట్టుకుని క్యాడర్ స్ర్టెంత్‌కు మించి ఎక్కువ స్థానికేతరులను కేటాయించారని అన్నారు. అక్రమంగా పైరవీలతో వేర్వేరు జిల్లాల ఉపాధ్యాయులకు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్‌లు ఇచ్చారని తెలిపారు. వాటిని కొత్త ప్రభుత్వం రద్దుచేసి స్థానిక టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.