రుణమాఫీ పత్రాలు, పాసుపుస్తకాలు అందించాలి

ABN , First Publish Date - 2023-08-29T00:03:14+05:30 IST

రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే రుణమాఫీ పత్రాలతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలను అందించాలని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

రుణమాఫీ పత్రాలు, పాసుపుస్తకాలు అందించాలి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

  • డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

కులకచర్ల, ఆగస్టు 28: రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే రుణమాఫీ పత్రాలతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలను అందించాలని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ సమావేశం విజయవంతం కావడంతో సోమవారం మండలంలోని పాంబండ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం కులకచర్లలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేసినట్లు చెబుతున్నా ఇంకా బకాయి ఉందని, బ్యాంకు అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ప్రకటించిన డిక్లరేషన్‌లను ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి క్యాబినెట్‌ సమావేశంలో అమలు చేస్తుందన్నారు. పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌లతో అధికార పార్టీ భయాందోళనకు గురవుతుందన్నారు. త్వరలోనే మరో సమావేశం నిర్వహించి బీసీ డిక్లరేషన్‌ ప్రకటింస్తామని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్‌-2 అధ్యక్షుడు భరత్‌కుమార్‌, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీఎ్‌స.ఆంజనేయులు, కార్యదర్శి గోపాల్‌నాయక్‌, ప్రకాశ్‌రెడ్డి, జలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-29T00:03:14+05:30 IST