‘కంటి వెలుగు’ దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2023-03-02T00:17:13+05:30 IST

కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని పెదవేడు సర్పంచ్‌ గౌండ్ల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పెదవేడులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.

‘కంటి వెలుగు’ దేశానికే ఆదర్శం

షాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌, మార్చి 1 : కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని పెదవేడు సర్పంచ్‌ గౌండ్ల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పెదవేడులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఉపసర్పంచ్‌ సుదర్శన్‌రెడ్డి, గ్రామస్తులు నర్సింహులుగౌడ్‌, రవి, మహేందర్‌, సూర్యకాంత్‌రెడ్డి, ప్రదీ్‌పగౌడ్‌, జనార్దన్‌గౌడ్‌, సంపత్‌, శ్రీను తదితరలు ఉన్నారు. శంషాబాద్‌ మండలం పెద్దగోల్కొండలో వారం రోజులుగా జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమం బుధవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా సర్పంచ్‌ లక్ష్మయ్య హాజరయ్యారు. డాక్టర్లు సేవలను ప్రశంసించి సన్మానించారు. ఉప సర్పంచ్‌ స్వరూపా నర్సింహాగౌడ్‌, డాక్టర్లు ప్రభాకర్‌, ఉస్మాన్‌,రాహుల్‌, నార్సింగ్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీకాంత్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:17:13+05:30 IST