భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:35 PM
భార్యను మానసికంగా, శారీరకంగా వేధించి హత్య చేసిన భర్తకు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి జీవితఖైదుతో పాటు 10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు.
కొత్తూర్, డిసెంబరు 22: భార్యను మానసికంగా, శారీరకంగా వేధించి హత్య చేసిన భర్తకు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి జీవితఖైదుతో పాటు 10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని సిద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతగట్టుతండాకు చెందిన సబావత్ లక్ష్మణ్(32)కు తలకొండపల్లి మండలం బలసులపల్లితండాకు చెందిన రజితతో 2019సంవత్సరంలో వివాహమైంది. కాగా, నెల రోజుల నుంచే లక్ష్మణ్‌తో పాటు అతని కుటుంబసభ్యులు రజితను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో 15-10-2019 నాడు లక్ష్మణ్ తన కుటుంబసభ్యుల సహకారంతో భార్య రజితను కొట్టి హత్య చేశాడు. రజిత మేనమామ జర్పుల సేవ్యా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నేరస్తులను అరెస్ట్ చేసి, కోర్టులో చార్జిషీట్ వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘు హత్య కేసుకు సంబంధించి సాక్షులను కోర్డులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వపరాల అనంతరం నేరం రుజువు కావడంతో అడిషన్ జడ్జి హరీష నిందితుల్లో ఎ-1గా ఉన్న సబావత్ లక్ష్మణ్‌కు జీవితఖైదుతో పాటు 10వేల రుపాయలు జరిమానా విధించారు.