బీఆర్‌ఎస్‌ను సాగనంపుదాం

ABN , First Publish Date - 2023-02-07T00:14:16+05:30 IST

ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని సాగనంపుదామని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ అన్నారు. మోసపూరిత పాలన చేస్తున్న ఆపార్టీని తరిమికొట్టేవరకూ నిద్రపోయేది లేదన్నారు.

బీఆర్‌ఎస్‌ను సాగనంపుదాం
సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రమేష్‌

బషీరాబాద్‌, ఫిబ్రవరి 6: ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని సాగనంపుదామని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ అన్నారు. మోసపూరిత పాలన చేస్తున్న ఆపార్టీని తరిమికొట్టేవరకూ నిద్రపోయేది లేదన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండలం నవాంద్గీ, గంగ్వార్‌ గ్రామాల్లో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామల్లో ప్రజలతో కలిసి నడుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చేఎన్నికల్లో తాండూరు నుంచి పోటీలో ఉంటానని, ఎలాంటి డౌట్‌ పెట్టుకోవద్దన్నారు. ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, మండలాధ్యక్షుడు శంకరప్ప, యూత్‌ ప్రెసిడెంట్‌ రాజవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు ఎం.రాకేష్‌, ఉత్తంచంద్‌, జనార్ధన్‌రెడ్డి, కలాల్‌ నర్సింహులుగౌడ్‌, అలీం, జి.వీరేశం, బస్వారాజ్‌ ఉన్నారు.

ఎన్నికల నాటికి మా కుటుంబమంతా ఒక్కటవుతాం

తాండూరు: ప్రణాళికబద్ధంగా వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతామని, అప్పటివరకు మా కుటుంబమంతా ఒక్క తాటిపైకి వస్తుందని ఎం.రమేష్‌ అన్నారు. సోమవారం తాండూరులో కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, మాజీ జడ్పీటీసీ రాకే్‌షతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఇతర పార్టీల వారిని రకరకాలుగా ఆశ చూపించి పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హామీల మోసాలపై చార్జిషీట్‌ తయారు చేసి ప్రజల్లోకి వెళతామన్నారు. రాకేష్‌ మాట్లాడుతూ కాంగ్రె్‌సలోకి తిరిగి రావడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పారు. పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతామని అన్నారు. ఎవరైనా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. నాయకులు ఉత్తంచంద్‌, జనార్ధన్‌రెడ్డి, అలీం తదితరులు ఉన్నారు.

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి

మేడ్చల్‌ టౌన్‌ : రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి కోరారు. గౌడవెల్లిలోని గుడిబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాయిలాపూర్‌లో యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశత్వ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు కాంగ్రె్‌సకు అండగా నిలవాలని కోరారు. నియోజకవర్గ ఏ, బీ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు పోచయ్య, మహే్‌షగౌడ్‌, మండలాధ్యక్షుడు రమణారెడ్డి, సురేందర్‌ ముదిరాజ్‌, పత్తి కుమార్‌, గువ్వ రవికుమార్‌ ముదిరాజ్‌, శేఖర్‌, రాహుల్‌, సురే్‌షనాయక్‌, బాల్‌రెడ్డి, మల్లే్‌షగౌడ్‌, శ్రీనివా్‌సరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2023-02-07T00:14:17+05:30 IST