ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేద్దాం
ABN , First Publish Date - 2023-02-21T23:48:40+05:30 IST
మార్చి 12న జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేద్దామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ అన్నారు.
షాబాద్, ఫిబ్రవరి 21: మార్చి 12న జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేద్దామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం షాబాద్‌లో అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... మార్చి 12న హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సమావేశానికి ఉద్యమకారులంతా తరలిరావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి రూ.10వేల కోట్ల కేటాయించాలన్నారు. సంక్షేమ పథకాల్లో 20శాతం ఉద్యమకారులకు కేటాయించాలన్నారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధా న్యమివ్వాలన్నారు. ఉద్యమకారులకు పెన్షన్, ఉచిత బస్సు, ట్రైన్ పాసులను, హెల్త్ కార్డులు, 300 గజాల ఇంటి స్థలాన్ని, వడ్డీలేని రుణాలు ఇవ్వాలనే డిమాం డ్లతో సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలన్నారు. ఉద్యోగాల్లో విద్యార్థి ఉద్యమకారులకు కోటా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం, నాయకులు ఆంజనేయులు, చెన్నయ్య, వెంకటస్వామి, ఖలీల్, మతిన్, మహేశ్వర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, నవాజ్, శివకుమార్, రమేష్, బాల్‌రాజ్ పాల్గొన్నారు.