పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థిని గెలిపించుకుందాం

ABN , First Publish Date - 2023-02-21T23:43:59+05:30 IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి సామల మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థిని గెలిపించుకుందాం
కొత్తూర్‌: ఉన్నత పాఠశాలలో మహేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

కొత్తూర్‌, ఫిబ్రవరి 21: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి సామల మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తూర్‌, నందిగామ మండలాల్లోని ఆయా పాఠశాలల్లో మహేందర్‌రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించడంలో పీఆర్‌టీయూటీఎస్‌ ముందుంటుందన్నారు. సీపీఎ్‌సను రద్దు చేయించి ఓపీఎస్‌ విధానాన్ని తీసుకవచ్చేందుకు సంఘం కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. తమ సంఘం అభ్యర్థి చెన్నకేశవరెడ్డి గెలుపునకు ఉపాధ్యాయులు నడుంబిగించాలని మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూర్‌, నందిగామ మండలాల సంఘం అధ్యక్షులు విజయ్‌సాగర్‌, రాఘవేందర్‌, నాయకులు ప్రభాస్‌, రమేష్‌, ఆంజనేయులు, జంగయ్య, సోంభూపాల్‌రెడ్డి, కమలేష్‌, ధనుంజయగౌడ్‌, భరత్‌భూషణ్‌, మదుసూదన్‌రెడ్డి, బాబురావు, నరేందర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం చెన్నకేశవరెడ్డికి మద్దతుగా పీఆర్‌టీయూ సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయన బుధవారం నామినేషన్‌ వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస సాగర్‌, ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌ గౌడ్‌, పద్మారావు, జంగయ్య పాల్గొన్నారు.

టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థిని గెలిపిద్దాం

కందుకూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎ్‌సయూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డిని గెలిపిద్దామని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చావ రవి పిలుపునిచ్చారు. మంగళవారం ఆసంఘం అభ్యర్థి పి.మాణిక్‌రెడ్డికి మద్దతుగా కందుకూరు, మహేశ్వరం మండలాల్లో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బుగ్గరాములు, సంఘం మహేశ్వరం, కందుకూరు మండలాల నేతలు కల్లేష్‌, శ్రీనివాస్‌, కృష్ణయ్య, నర్సింహులు, రాములు, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:44:00+05:30 IST