ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రశ్నపత్రాల లీకేజీ
ABN , First Publish Date - 2023-03-18T23:59:03+05:30 IST
ప్రభుత్వ వైఫల్యం వల్లే టీఎ్‌సపీఎ్‌ససీ ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయని సీపీఎం నాయకులు ఆరోపించారు.

పరిగి, మార్చి 18: ప్రభుత్వ వైఫల్యం వల్లే టీఎ్‌సపీఎ్‌ససీ ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయని సీపీఎం నాయకులు ఆరోపించారు. పరిగిలోని బస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు హబీబ్ తదితరులు పాల్గొన్నారు.