విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
ABN , First Publish Date - 2023-12-05T23:34:54+05:30 IST
విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచాలన్న ఉద్దేశ్యంతో కళాశాలలో స్టూడెండ్ యాక్షన్ కమిటీ ప్రారంభించామని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ జక్కల నర్సింహ్మారెడ్డి అన్నారు.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 5: విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచాలన్న ఉద్దేశ్యంతో కళాశాలలో స్టూడెండ్ యాక్షన్ కమిటీ ప్రారంభించామని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ జక్కల నర్సింహ్మారెడ్డి అన్నారు. కళాశాలలో మంగళవారం విద్యార్థి సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి నర్సింహారెడ్డి మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే వారు భవిష్యత్తులో అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలరన్నారు. నాయకత్వ లక్షణం ప్రతీ విషయంలో కమాండింగ్‌ను పెంచుతుందన్నారు. నాయకత్వం కేవలం రాజకీయ రంగానికే పరిమితం కాదన్నారు. అన్ని రంగాల్లో నాయకత్వ లక్షణం వ్యక్తి ఎదుగుదలకు దోహద పడుతుందన్నారు. తమ కళాశాల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణం వృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో స్టూడెంట్ యాక్షన్ కమిటీ ప్రారంభించామని తెలిపారు. యాక్షన్ కమిటీ సభ్యులను నర్సింహారెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశా కార్యదర్శి త్రిశూల్‌రెడ్డి, కరస్పాండెంట్ జక్కుల సంగీతారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మోహన్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ లోకనాథం, డీన్ రామదాసు, త్రిలోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.