శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అతిపెద్ద కార్గో విమానం
ABN , First Publish Date - 2023-08-02T22:47:21+05:30 IST
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మంగళవారం సాయంత్రం 5.27 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైంది.
ఇప్పటివరకు విమానాశ్రయంలో రెండోసారి ల్యాండైన ఎయిర్‌బస్-ఏ320 (బెలూగా)
2016లో ల్యాండైన ఆంతోనోవ్ ఏఎన్ 225 కార్గో విమానం
శంషాబాద్ రూరల్, ఆగస్టు 2 : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మంగళవారం సాయంత్రం 5.27 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైంది. థాయిలాండ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఎయిర్‌బస్-ఏ320 (బెలూగా) సురక్షితంగా ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ అయ్యేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కాగా, ఇది గతేడాది డిసెంబర్‌లో కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 2016లో ఆంతోనోవ్ ఏఎన్ 225 కార్గో విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయింది. కాగా, విమానాశ్రయంలో ప్రయాణికులు, సిబ్బంది ఎయిర్‌బస్-ఏ320 కార్గో ఫ్లైట్‌ను ఆసక్తిగా చూశారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. బుధవారం కూడా విమానం ఎయిర్‌పోర్టులోనే ఉంది. నేడు(గురువారం) ఇక్కడి నుంచి బయలుదేరి ఈజిప్ట్ వెళుతుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.