భూ సమస్యలు పరిష్కారించాలి

ABN , First Publish Date - 2023-07-03T23:57:20+05:30 IST

జిల్లాలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, భూ సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాడుతామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షడు ధర్మానాయక్‌, తెలంగాణ ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్‌ యాదయ్య డిమాండ్‌ చేశారు.

భూ సమస్యలు పరిష్కారించాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ప్రజలు

తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

రంగారెడ్డి అర్బన్‌, జూలై 3 : జిల్లాలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, భూ సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాడుతామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షడు ధర్మానాయక్‌, తెలంగాణ ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్‌ యాదయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు, ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో ఇల్లు, ఇళ్ల స్థలాలు లేక పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, జిల్లాలో మంజూరైన డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇప్పటి వరకు అర్హులకు ఇవ్వలేదన్నారు. జిల్లాలో పూర్తయిన ఇళ్లను జిల్లా వాసులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇల్లులేని పేదలందరికీ 120 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, తట్టిఅన్నారం, లష్కర్‌గూడ, బాచారం, కందుకూర్‌, సాహెబ్‌నగర్‌ల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రామోజీఫిలింసిటీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, చిన్నతూండ్ల, చింతపట్ల, కొత్తపల్లి, మేడిపల్లి గ్రామాలలో గతంలో పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలలను పంచాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 17వేల ఎకరాల భూమి కబ్జాకు గురయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, పారిశ్రామిక వేత్తలకు వేల ఎకరాలు ధారదత్తం చేస్తూ పేద ప్రజలకు ఇంటి స్థలం ఇవ్వటానికి మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనబడుటలేదన్నారు. ఇంటి స్థలం ఉండి ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి 3 లక్షలు ఇస్తామన్న డబ్బులు ఇళ్లు కట్టుకోవడానికి ఏ మాత్రం సరిపోవని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కాడిగళ్ళ బాస్కర్‌, జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్‌ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూర్‌ జగన్‌, జిల్లా అధ్యక్షుడు పి. అంజయ్య, సీఎచ్‌. జంగయ్య, ఎన్‌, శ్యామసుందర్‌, శ్రీనునాయక్‌, కె. శ్రీనివా్‌సరెడ్డి, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి. సామేల్‌, ఎం. ప్రకా్‌షకారత్‌, జిల్లా నాయకులు అలంపల్లి నర్సింహ, సీఐటీయూ జిల్లా నాయకులు డి. జగదీష్‌, ఇ. నర్సింహ, డి. కిషన్‌, మహిళ సంఘం జిల్లా కార్యదర్శి సుమలత, ఎం. అరుణ, డి. మమత, జిఎం.పి.ఎస్‌. నాయకులు మల్లేష్‌, పీఎన్‌ఎం నాయకులు జి. గణేష్‌, జె. రాజశేఖర్‌, డీవైఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జగన్‌, అనిల్‌రెడ్డి ఎస్‌.ఎ్‌ఫఎ్‌సఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్‌, మస్కు చరణ్‌, ఇ. తరంగ్‌, ఎం. శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-03T23:57:20+05:30 IST