Share News

భూ తగాదా.. వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2023-12-10T22:53:46+05:30 IST

పొలం పని చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు తమకు చెందిన భూమిని ఆక్రమించుకున్నారంటూ వ్యక్తిపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రావిరాలలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

భూ తగాదా.. వ్యక్తికి గాయాలు

ఆదిభట్ల, డిసెంబరు 10 : పొలం పని చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు తమకు చెందిన భూమిని ఆక్రమించుకున్నారంటూ వ్యక్తిపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రావిరాలలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదిభట్ల ఎస్‌ఐ శ్రీనివా్‌సరావు తెలిపిన వివరాల ప్రకారం.. రావిరాలకు చెందిన సన్నిళ్ల యాదమ్మకు కొంగరకుర్ధు రెవెన్యూ పరిధి సర్వేనెంబర్‌ 13, 14లలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అదే గ్రామానికి చెందిన మీగడ రాజు అనే వ్యక్తికి కూడా కొంత భూమి ఉంది. కాగా, వారిద్దరికీ కొంతకాలంగా గట్టు తగాదా నడుస్తోంది. ఇదే విషయమై శనివారం సాయంత్రం ఇరువురి మధ్య గొడవకు దారితీసింది. రాజు కుటుంబ సభ్యులు యాదమ్మ, ఆమె కుమారులు గోవర్ధన్‌రెడ్డి, విష్ణు వర్ధన్‌రెడ్డిలపై దాడికి దిగారు. ఈఘర్షణలో గోవర్ధన్‌ రెడ్డి తలకు గాయమైంది. యాదమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు రాజు కుటుంబ సభ్యులు 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-12-10T22:53:47+05:30 IST