Share News

ఆర్టీసీ బస్సు ఢీకొని కూలీ దుర్మరణం

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:14 AM

కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో అరవింద్‌(28) అనే కూలీ మృతి చెందాడని ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని కూలీ దుర్మరణం

కొత్తూర్‌, డిసెంబరు 27: కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో అరవింద్‌(28) అనే కూలీ మృతి చెందాడని ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ కొంతకాలం క్రితం తిమ్మాపూర్‌కు వలస వచ్చి ప్రీకాస్ట్‌ తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. బీడీలు తెచ్చుకోడానికి రోడ్డు దాటుతుండగా.. ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈమేరకు మృతదే హాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, అరవింద్‌ స్నేహితుడు ముజామిల్‌ఖాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి..

కడ్తాల్‌, డిసెంబరు 27 :రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని మక్తమాదారం గేటు సమీపంలో కడ్తాల, తలకొండపల్లి ప్రదాన రహదారిపై బుధవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి చెందిన పులిజాల వెంకటేష్‌(28) కడ్తాల వైపు నుంచి బైక్‌పై వెల్జాలకు వెళ్తున్నాడు. ఈక్రమంలో మక్తమదారాం గేటు సమీపంలో ఎదురుగా గడ్డి లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 12:14 AM