తాండూరు కాంగ్రెస్ నేతలతో కేఎల్లార్ భేటీ
ABN , First Publish Date - 2023-07-21T00:17:56+05:30 IST
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిచ్చెన్నగారి ల క్ష్మారెడ్డి గురువారం తాండూరు కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు.
చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం
తాండూరు, జూలై 20: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిచ్చెన్నగారి ల క్ష్మారెడ్డి గురువారం తాండూరు కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. తాండూరు వచ్చిన ఆయన కాంగ్రెస్ బీసీ సెల్ నాయకుడు ఉత్తమ్‌చంద్ నివాసంలో పీసీసీ కార్యదర్శి ధారాసింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్దన్‌రెడ్డి తదితరులతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. కాగా లక్ష్మారెడ్డి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. గతంలోనూ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడారు. ఈ ప్రాంత ప్రజలతో ఆయనకు పరిచయాలున్నాయి. తాండూరుకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో భేటీ అయి సూచనప్రాయంగా పోటీ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి రేసులో తానూ ఉన్నాని కాంగ్రెస్ నాయకులకు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీకి దూరమైన లక్ష్మారెడ్డి.. ఇటీవల పార్టీ సీనియర్ల కోరిక మేరకు పార్టీ పనుల్లో పాల్గొంటున్నారు.