కేసీఆర్‌ నియంత పాలనకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు

ABN , First Publish Date - 2023-05-31T23:47:14+05:30 IST

ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ దుర్మార్గ, అరాచక, అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.

కేసీఆర్‌ నియంత పాలనకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు

తలకొండపల్లి, మే3: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ దుర్మార్గ, అరాచక, అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు రవిగౌడ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఆచారి హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, జూన్‌ 30 వరకు నిర్వహించే మహా సంపర్క్‌ అభియాన్‌ విజయవంతం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆచారి మాట్లాడుతూ ఆమనగల్లు పట్టణంలో జూన్‌ 6న పది వేల మందితో బీజేపీ విజయసంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బండి సంజయ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు ముఖ్య అతిథులుగా హజరవుతున్నట్లు చెప్పారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ శేఖర్‌రెడ్డి, కో-కన్వీనర్‌ నర్సింహ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:47:14+05:30 IST