వ్యవసాయాన్ని పండగలా మార్చిన కేసీఆర్
ABN , First Publish Date - 2023-02-21T23:45:31+05:30 IST
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి చేయూతనివ్వడంతో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్‌ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి) అన్నారు.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి చేయూతనివ్వడంతో వ్యవసాయం పండగలా మారిందని బీఆర్‌ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి) అన్నారు. ఆయన చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర మంగళవారం 31వ రోజు తుర్కగూడ, కప్పాడు గ్రామాల్లో కొనసాగగా 400కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. గ్రామ కూడళ్లలో ఆయన మాట్లాడారు. గతంలో రైతులు పెట్టుబడికి మిత్తికి డబ్బు తెచ్చి తక్కు వ ధరకే వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించేవారన్నారు. రైతుబంధుతో ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పెట్ట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఏటా రూ.పదివేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే రైతు బీమాతో ఆ కుటు ంబానికి రూ.5లక్షల సాయం అందుతుందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగు నీరు సరఫరా అవుతోందని, మిషన్ కాకతీయతో చెరువులు కుంటల అభివృద్ధి జరిగి నేడు నీటితో కళకళలాడుతున్నాయ న్నారు. ఇంటి జాగ ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని పేదలకు ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున సాయమందిం చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. కప్పాడులో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజి పనులకు రూ.5లక్షలు, 80 స్ర్టీట్ లైట్లు మంజూరైనట్లు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుర్కగూడలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అజయ్, యాదగిరిలకు ఆయన ఆర్థికసాయం అందజేశారు. పాదయాత్రలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గ రాములు, ఎంపీపీ కృపేశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, సర్పంచ్‌లు సామల హంసమ్మ, కత్తుల పవిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ప్యాక్స్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, నరేందర్‌రెడ్డి, జలంధర్‌గౌడ్, మునీర్, బీఆర్‌ఎస్వీ నాయకుడు నిట్టు జగదీశ్వర్ పాల్గొన్నారు.