అంగరంగ వైభవంగా కావడి యాత్ర

ABN , First Publish Date - 2023-08-12T22:47:58+05:30 IST

పోచారం మున్సిపాలిటీ యంనంపేట్‌లోని రంగనాథస్వామి ఆలయం నుంచి లింగాలకుంట నాగలింగేశ్వర ఆలయం వరకు కావడియాత్రను శనివారం శోభాయమానంగా నిర్వహించారు.

అంగరంగ వైభవంగా కావడి యాత్ర
కావడి యాత్రలో పాల్గొన్న భక్తులు, నాయకులు

ఘట్‌కేసర్‌, ఆగస్టు 12: పోచారం మున్సిపాలిటీ యంనంపేట్‌లోని రంగనాథస్వామి ఆలయం నుంచి లింగాలకుంట నాగలింగేశ్వర ఆలయం వరకు కావడియాత్రను శనివారం శోభాయమానంగా నిర్వహించారు. రంగనాథస్వామి ఆలయం వద్ద వందలాది మంది భక్తులు శివలింగానికి పూజలు నిర్వహించి కుండల్లో జలాన్ని కావళ్లతో మోసూకుంటు శంభోశంకర అంటూ భజనలతో యాత్ర కొనసాగింది. రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు యాత్ర సాగింది. శివారెడ్డిగూడ దండ్లగడ్డ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలోని శివలింగానికి జాలాఅభిషేకం చేశారు. అక్కడి నుంచి లింగాలకుంట నాగలింగేశ్వరాలయానికి వచ్చి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు నీటి ఇబ్బందులు రాకుండా పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి సొంత డబ్బుతో బోర్‌ వేయించారు. కార్యక్రమాల్లో వైస్‌ చైర్మన్‌ రెడ్డియానాయక్‌, కౌన్సిలర్లు ధనలక్ష్మి, రవీందర్‌, మండల రైతు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, బాలేశ్‌, రాజేష్‌, జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-12T22:47:58+05:30 IST