నేడు కసిరెడ్డి విజయోత్సవ ర్యాలీ
ABN , First Publish Date - 2023-12-10T23:02:08+05:30 IST
కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొంది బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి నారాయణరెడ్డి విజయోత్సవ ర్యాలీని నేడు(సోమవారం) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కడ్తాల్, డిసెంబరు 10 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొంది బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి నారాయణరెడ్డి విజయోత్సవ ర్యాలీని నేడు(సోమవారం) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కడ్తాల నుంచి ఆమనగల్లు, వెల్దండ మండలాల మీదుగా కల్వకుర్తి వరకు ర్యాలీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం కసిరెడ్డి విజయోత్సవ ర్యాలీ సన్నాహక సమావేశం నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీ విజయవంతాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. కడ్తాలతో పాటు మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉదయం కడ్తాలకు చేరుకోవాలని కోరారు. ఉదయం 10 గంటలకు కడ్తాలలో విజయోత్సవ ర్యాలీ ప్రారంభం అవుతుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆరు గ్యారంటీలలో రెండింటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. కార్యకర్తల కష్టం, త్యాగ ఫలితమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్ చేగూరి వెంకటేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్‌బాబా, మండల కాంగ్రెస్ సేవాధల్ అధ్యక్షుడు గురిగళ్ల లక్ష్మయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాంచందర్ నాయక్, నాయకులు మల్లే్‌షగౌడ్, యాదయ్యగౌడ్, మల్లయ్య, సత్యం యాదవ్, దయాకర్ రెడ్డి, శ్రీను, శ్రీశైలం, క్యామ రాజేశ్, భానుకిరణ్, వంశీ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కసిరెడ్డి ర్యాలీని విజయవంతం చేయాలని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు గూడూరు భాస్కర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, హన్మనాయక్, శ్రీకాంత్‌రెడ్డి, జహంగీర్ అలీలు కోరారు.