కర్ణాటక టు బషీరాబాద్
ABN , First Publish Date - 2023-08-13T23:38:56+05:30 IST
వ్యవసాయ పనులు జోరందుకోవడంతో కూలీల కొరత నెలకొంది. పొలాల్లో కలుపుతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వ్యవసాయ కూలీల కొరత
బషీరాబాద్ మండలంలో జోరందుకున్న కలుపుతీత పనులు
కర్ణాటక నుంచి వాహనాల్లో కూలీల తరలింపు
బషీరాబాద్, ఆగస్టు 13: వ్యవసాయ పనులు జోరందుకోవడంతో కూలీల కొరత నెలకొంది. పొలాల్లో కలుపుతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కూలీల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కలుపుతీత, ఎరువులు వేయడం, మందుల పిచికారీ వంటి వాటికి మనుషులు కొరతయ్యారు. రైతులందరూ ఒకేసారి పనులు చేపడుతుండడంతో కూలీల కొతర వేధిస్తోంది. దీంతో సరిహద్దు కర్ణాటక రాష్ట్రం అడికి, అయ్యాలం, నిడుగుంది, హల్కోడ, జెట్టూరు, పోతుగంటి తదితర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, జీపుల్లో దిగుమతి చేసుకుంటున్నారు. మండలంలో పత్తి 9,150 ఎకరాలు, కంది 14,048 ఎకరాలు, పెసర 1,600, మినుము 480ఎకరాలు, ఇతర పంటలు 950ఎకరాల్లో సాగు చేశారు. కూలీలను కర్ణాటక గ్రామాల నుంచి రవాణా చార్జీలు పెట్టి ఆటోలు, జీపుల్లో తీసుకువచ్చి కలుపుతీత పనులు చేయిస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి మరింత భారంగా మారుతోంది.