కంటి వెలుగు పథకం దేశానికి అదర్శం

ABN , First Publish Date - 2023-02-13T23:42:08+05:30 IST

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం దేశానికి అదర్శమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి అన్నారు.

కంటి వెలుగు పథకం దేశానికి అదర్శం
శంషాబాద్‌ రూరల్‌: కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి

శంషాబాద్‌రూరల్‌/షాద్‌నగర్‌ అర్బన్‌/ఆమనగల్లు/యాచారం, ఫిబ్రవరి 13 : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం దేశానికి అదర్శమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం స్థానిక కౌన్సిలర్‌ పారెపల్లి లావణ్యశ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌ సుష్మాతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బండి గోపాల్‌ యాదవ్‌, వెంకటే్‌షగౌడ్‌, రత్నం, శ్రీనివా్‌సగౌడ్‌, సురేష్‌, పెంటయ్య, దర్శన్‌, ప్రవీణ్‌గౌడ్‌, అశోక్‌గౌడ్‌, రాజుగౌడ్‌, కుమార్‌, సుకానంద పాల్గొన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌లో జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్‌ జయలక్ష్మి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ కంటివెలుగు కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. గ్రామస్థుల కంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం సోమవారం ముగిసింది. ఎంపీడీవో పారుఖ్‌హుస్సేన్‌, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ పరీక్షిత్‌, నరేంద్ర, మంజులాదేవిలు, వైద్య సిబ్బందిని సర్పంచ్‌ అంబర్‌ సింగ్‌ సత్కరించి అభినందించారు. మేడిగడ్డ తండాలో 866మందికి కంటి పరీక్షలు చేసినట్లు సర్పంచ్‌ తెలిపారు. అదేవిధంగా యాచారం మండలంలోని గున్‌గల్‌, తక్కళ్లపల్లి తండాల్లో సోమవారం 247మందికి కంటి పరీక్షలు చేశారు. 42 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఉదయం 9గంటలనుంచి సాయంత్రం 5గంటల వరకు కంటి పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు.

Updated Date - 2023-02-13T23:42:09+05:30 IST