తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ పాత్ర కీలకం

ABN , First Publish Date - 2023-09-07T00:10:47+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పాత్ర కీలకమని, ఆయన చరిత్రలో గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తి అని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్‌ శైలజా ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ పాత్ర కీలకం
భూమి పూజ చేస్తున్న ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్‌ శైలజ ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి

ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్‌ శైలజా ఆగిరెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి

చేవెళ్లలో ప్రొఫెసర్‌ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ

చేవెళ్ల, సెప్టెంబరు 6 : తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పాత్ర కీలకమని, ఆయన చరిత్రలో గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తి అని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్‌ శైలజా ఆగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తి జయశంకర్‌ సార్‌ అని, ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని తెలిపారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని, నేడు చేవెళ్లలో విశ్వబ్రాహ్మణులు జయశంకర్‌ విగ్రహం ఏర్పాటుకు పూనుకోవడం గొప్ప విషయమని అన్నారు. జయశంకర్‌ను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జయశంకర్‌ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రామస్వామి, ఎంపీటీసీ రాములు, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్‌ శ్రీనువాస్‌, కాంగ్రెస్‌ మండల మహిళా అధ్యక్షురాలు దేవర సమతా వెంకట్‌రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం చేవెళ్ల మండలాధ్యక్షుడు వి.శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసచారి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శంభులింగంచారి, ఉపాధ్యక్షులు ఆనంద్‌, విశ్వరూపచారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు లింగాచారి, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, లీగల్‌ అడ్వైజర్‌ బాలస్వామి, విశ్వబ్రాహ్మణ సంఘం మండల మాజీ అధ్యక్షులు మోనాచారి, యాదగిరిచారి, యూత్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌, ఉపాధ్యక్షుడు శంకరాచారి, పెంటయ్య చారి, శేఖర్‌చారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-07T00:10:47+05:30 IST