భార్య, కూతురు మృతికి కారకుడైన వ్యక్తికి జైలు

ABN , First Publish Date - 2023-08-22T00:03:17+05:30 IST

భార్య, కుతూరు మృతికి కారణమైన వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ షాద్‌నగర్‌ అస్టిటెంట్‌ సీనియర్‌ జడ్జి తీర్పు ఇచ్చారు.

భార్య, కూతురు మృతికి కారకుడైన వ్యక్తికి జైలు

కొత్తూర్‌, ఆగస్టు 21: భార్య, కుతూరు మృతికి కారణమైన వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ షాద్‌నగర్‌ అస్టిటెంట్‌ సీనియర్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొడిచర్లతండాకు చెందిన రాజునాయక్‌(24), స్వర్ణ(22) భార్యాభర్తలు. వీరికి 14 నెలల కూతురు మధుశ్రీ ఉండేది. 2020లో రాజునాయక్‌ తన భార్య స్వర్ణ ను వేధింపులకు గురిచేసేవాడు. భరించలేని ఆమె కూతురు మధుశ్రీతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. కేసును విచారించిన జడ్జి నిందితుడు రాజుకు పదేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధించారు.

బాలికపై లైంగికదాడి కేసులో 20ఏళ్ల జైలు

కొందుర్గు, ఆగస్టు, 21: బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడికి కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించిందని ఎస్సై కృష్ణయ్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధి రేగడి చిల్కమర్రికి చెందిన పి.గణేష్‌ 2017 మార్చి 18న ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఇప్పిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడన్నారు. చిన్నారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించామన్నారు. సోమవారం షాద్‌నగర్‌ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి 20సంవత్సరాల జైలుశిక్షతోపాటు, 5వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు.

Updated Date - 2023-08-22T00:03:17+05:30 IST