నిన్న దేవుడన్న నోర్లే దయ్యం అంటున్నాయి
ABN , First Publish Date - 2023-11-10T23:52:18+05:30 IST
నిన్నటి వరకు సీఎం కేసీఆర్ దేవుడంటూ పొగిడిన నేతలు పార్టీలు మారాక దయ్యం అని ఎలా అంటారని వికారాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. అనంతగిరి దేవాలయంలో, వికారాబాద్ శుక్రవారం పట్టణంలోని దర్గా, చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించి అనంతరం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌దాఖలు చేశారు.
వికారాబాద్, నవంబరు 10: నిన్నటి వరకు సీఎం కేసీఆర్ దేవుడంటూ పొగిడిన నేతలు పార్టీలు మారాక దయ్యం అని ఎలా అంటారని వికారాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. అనంతగిరి దేవాలయంలో, వికారాబాద్ శుక్రవారం పట్టణంలోని దర్గా, చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించి అనంతరం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70సంవత్సరాలు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయని వారు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. వికారాబాద్ ప్రజలు చైతన్య వంతులని, ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి వేస్తారని నష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్, నవీన్ కుమార్, బొండల శ్రీనివాస్, మాలే లక్ష్మణ్ బల్వంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కష్టపడి పని చేసుకుందాం
కష్టపడి పనిచేసుకుందాం గెలుపు మనదేనని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో మర్పల్లి మండల కేంద్రానికి చెందిన అన్నపూర్ణ , పంచలింగాల్ గ్రామానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ప్రకాశ్, రామ్ లక్ష్మణ్, పట్లూర్ గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు మొత్తం 150 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించండి
ధారూరు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు మద్దతుగా ఆయన సతీమణి డాక్టర్ సబితా ఆనంద్ శుక్రవారం మండలంలోని డీకే తండా, స్టేషన్ ధారూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన, అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. కారు గుర్తుకు ఓటేసి మెతుకు ఆనంద్‌ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక, నాయకులు గోపాల్, బాల్‌రాజ్‌నాయక్, రవి, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.