మీ-సేవ కేంద్రాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2023-09-22T22:28:13+05:30 IST

చౌడాపూర్‌, బుర్హాన్‌పూర్‌ గ్రామాల్లో కొత్తగా మీ-సేవ కేంద్రాల నిర్వహణకు ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మీ-సేవ కేంద్రాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్‌, సెప్టెంబరు 22 : చౌడాపూర్‌, బుర్హాన్‌పూర్‌ గ్రామాల్లో కొత్తగా మీ-సేవ కేంద్రాల నిర్వహణకు ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు డిగ్రీ విద్యా అర్హతతో పాటుగా కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి స్థానికులై ఉండాలని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 30 తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను వికారాబాద్‌ కలెక్టరేట్‌లో సమర్పించాలని ఆయన తెలిపారు.

Updated Date - 2023-09-22T22:28:13+05:30 IST