ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2023-03-19T00:14:16+05:30 IST
మేడ్చల్‌జిల్లాలో శనివారం ంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 926మంది గైర్హాజరయ్యారు.

మేడ్చల్‌అర్బన్/ వికారాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌జిల్లాలో శనివారం ంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 926మంది గైర్హాజరయ్యారు. ఇంగ్లీష్ పేపర్-2 జనరల్ పరీక్షకు 51,036 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 50,151 మంది పరీక్షలు రాశారు. అదేవిధంగా 935 మంది ఒకేషనల్ పరీక్ష రాయాల్సిఉండగా 894 మంది హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ బోర్డుఅధికారి కిషన్ చెప్పారు. ఇంగ్లీష్-2 పరీక్షకు జిల్లాలో 155మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈపరీక్షకు 7809 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, వారిలో 7654మంది హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 6650మంది హాజరు కావాల్సి ఉండగా, 6527 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1159 మంది హాజరు కావాల్సి ఉండగా 1127మంది హాజరయ్యారు.