మన ఊరు-మన బడి పనుల పరిశీలన
ABN , First Publish Date - 2023-01-25T00:02:58+05:30 IST
మన ఊరు-మనబడి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
ధారూరు/ తాండూరు రూరల్, జనవరి 24: మన ఊరు-మనబడి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ధారూరుమండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు, మన బడి పనులను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠ శాలో చేపట్టిన వివిధ పనుల నాణ్యతను ఆయన తనీఖీ చేశారు. పనులు అలస్యంగా జరగుతున్నాయని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్ హఫీజ్‌ను ఆదేశించారు. కాగా పనులకు అవసరమైన ఇసుక దొరకక పనులు సాఫీగా సాగటంలేదని, ఇసుక పర్మిట్‌లు ఇప్పించాలని పలుమార్లు కోరినా సంబంధిత అధికారులు స్పందించటం లేదని కాంట్రాక్టర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పనులకు అవసరమైన ఇసుక సరఫరాకు అనుమతులు ఇవ్వాలని అదనపు కలెక్టర్ పెద్దెముల్ తహల్దార్‌కు ఫోన్‌లో చెప్పారు. అలాగే తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో మన ఊరు-మన బడి కింద చేపడుతున్న పనులన ు మంగళవారం అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పనులు వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనుల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మౌలిక సదుపాయాల సంస్థ ఈఈ ని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, సర్పంచు చంద్రమౌళి, అధికారులు ఉన్నారు.