Share News

కేంద్ర పథకాల అమలుకు చొరవ తీసుకోవాలి

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:56 PM

చెంచు, గిరిజనులకు కేంద్ర పథకాలు సక్రమంగా అందేలా అన్ని శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని ఎన్‌ఎ్‌సటీఎ్‌ఫడీసీ తెలంగాణ జోనల్‌ మేనేజర్‌, నోడల్‌ అధికారి డాక్టర్‌ కృష్ణవేణి మోత కోరారు.

కేంద్ర పథకాల అమలుకు చొరవ తీసుకోవాలి

కడ్తాల్‌, డిసెంబరు 30 : చెంచు, గిరిజనులకు కేంద్ర పథకాలు సక్రమంగా అందేలా అన్ని శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని ఎన్‌ఎ్‌సటీఎ్‌ఫడీసీ తెలంగాణ జోనల్‌ మేనేజర్‌, నోడల్‌ అధికారి డాక్టర్‌ కృష్ణవేణి మోత కోరారు. కడ్తాల మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ భవనంలో శనివారం సాయంత్రం చెంచు, గిరిజనులకు సంబంధించిన పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణవేణిమోత, డీటీడీవో రామేశ్వరి దేవిలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. కడ్తాల మండలంలో చెంచు, గిరిజనుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ అభియాన్‌ అమలుపై అధికారులకు కృష్ణవేణిమోత పలు సూచనలు చేశారు. రేషన్‌, ఆధార్‌, ఓట రు, ఆరోగ్యశ్రీ కార్డులు లేనివారికి వెంటనే అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీవో మదుసూధనాచారి, ఏవో శ్రీలత, ఏపీఎం రాజేశ్వరి, హెచ్‌డబ్ల్యూవోలు రామచంద్రయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:56 PM