ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ABN , First Publish Date - 2023-04-04T23:00:20+05:30 IST
ఇండిగో విమాన సర్వీసులో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది.
శంషాబాద్, ఏప్రిల్ 4 : ఇండిగో విమాన సర్వీసులో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 897ఇండిగో విమానం అక్కడి నుంచి ఉదయం 5.10గంటలకు బయలుదేరింది. అయితే విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ దగ్గరలోని శంషాబాద్ ఏటీసీని సంప్రదించగా విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు అనుమతించారు. విమానం ఉదయం 6.10గంటలకు సురక్షితంగా ల్యాండైంది. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమాన సర్వీసులో వారణాసికి పంపించారు.