సోషల్‌ మీడియాలో కించపరిచేలా పోస్టులు.. వ్యక్తిపై కేసు

ABN , First Publish Date - 2023-06-09T23:57:26+05:30 IST

ఒక వర్గానికి చెందిన వ్యక్తుల ఆడియోలను ఎడిటింగ్‌ చేసి వారిని వ్యక్తిగతంగా కించపరచడమే కాకుండా రెచ్చగొట్టేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమనగల్లు పట్టణానికి చెందిన గుండ్రాతి రమేష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శుక్రవారం తెలిపారు.

సోషల్‌ మీడియాలో కించపరిచేలా పోస్టులు.. వ్యక్తిపై కేసు

ఆమనగల్లు, జూన్‌ 9: ఒక వర్గానికి చెందిన వ్యక్తుల ఆడియోలను ఎడిటింగ్‌ చేసి వారిని వ్యక్తిగతంగా కించపరచడమే కాకుండా రెచ్చగొట్టేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమనగల్లు పట్టణానికి చెందిన గుండ్రాతి రమేష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శుక్రవారం తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. సోషల్‌ మీడియా గ్రూప్‌లలో ఎవరైనా ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే గ్రూప్‌ అడ్మిన్‌పై చట్ట పరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

Updated Date - 2023-06-09T23:57:26+05:30 IST