Share News

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

ABN , First Publish Date - 2023-12-03T23:58:45+05:30 IST

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన సంఘటన బొంరాస్‌పేట్‌ మండల పరిధిలోని బొట్లవనితండా సమీపంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ 163వ జాతీయ రహదారిలో ఆదివారం జరిగింది.

 రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

బొంరాస్‌పేట్‌, డిసెంబరు 3: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన సంఘటన బొంరాస్‌పేట్‌ మండల పరిధిలోని బొట్లవనితండా సమీపంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ 163వ జాతీయ రహదారిలో ఆదివారం జరిగింది. బొంరాస్‌పేట్‌ ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం దౌల్తాబాద్‌ మండలంలోని అల్లాపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణయాదవ్‌ (35) పరిగి వైపు బైక్‌పై వెళ్తుండగా బొట్లవనితండా గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల దగ్గర రోడ్డుపై వైశాలి అనే బాలికను ఢీకొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిద్దరినీ కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే కృష్ణయాదవ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణయాదవ్‌ హోంగార్డుగా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమాదంలో బాలిక ఎడమ కాలికి గాయాలైయ్యాయి. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-12-03T23:58:47+05:30 IST