స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఇంటికే తలంబ్రాలు

ABN , First Publish Date - 2023-03-19T22:36:55+05:30 IST

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణంలోని తలంబ్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఇంటికి పంపించేందుకు పోస్టల్‌ శాఖ అన్ని ఏర్పాటు చేసిందని షాద్‌నగర్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ జుబేర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఇంటికే తలంబ్రాలు

షాద్‌నగర్‌, మార్చి, 19 : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణంలోని తలంబ్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఇంటికి పంపించేందుకు పోస్టల్‌ శాఖ అన్ని ఏర్పాటు చేసిందని షాద్‌నగర్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ జుబేర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతారాముల కల్యాణం అనంతరం జరిగే తలంబ్రాల కార్యక్రమానికి సంబంధించి అంత్యాలయ తలంబ్రాలకు రూ.450. ముత్యాల తలంబ్రాలకు రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం పట్టణంలోని పోస్టాఫీ్‌సలో సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2023-03-19T22:36:55+05:30 IST