పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

ABN , First Publish Date - 2023-09-21T23:23:25+05:30 IST

ఇళ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటునే ఆరోగ్యంగా ఉంటామని దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కే.రాజిరెడ్డి తెలిపారు.

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
మేడ్చల్‌ టౌన్‌: అవగాహన కల్పిస్తున్న శ్రీరంగవరం సర్పంచ్‌ విజయేందర్‌రెడ్డి

దోమ, సెప్టెంబరు 21: ఇళ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటునే ఆరోగ్యంగా ఉంటామని దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కే.రాజిరెడ్డి తెలిపారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో గురువారం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయులు, ఐకేపీ ఉద్యోగులు జంగయ్య, శేఖర్‌, భాగ్య, మాధవి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

కులకచర్ల: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కులకచర్ల సర్పంచ్‌ సౌమ్యరెడ్డి తెలిపారు. గ్రామంలో స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో గురువారం స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అదేవిధంగా వర్మీ కంపోస్టు తయారీపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని కులకచర్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. గ్రామ పరిధిలోని డంపింగ్‌యార్డులో గురువారం తడి, పొడి చెత్త, వర్మీ కంపోస్టు ఎరువు తయారీపై స్థానిక గ్రామ మహిళ సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘం మహిళలు పాల్గొన్నారు.

మేడ్చల్‌ టౌన్‌: ఇంట్లో పేరుకుపోయిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్త సేకరించటానికి వచ్చే పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని శ్రీరంగవరం సర్పంచ్‌ విజయేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీరంగవరంలో గురువారం పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులతో కలిసి తడి, పొడి చెత్తపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రకాష్‌, ఉపసర్పంచ్‌ నర్సింహా, పంచాయతీసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:23:25+05:30 IST