ఉరేసుకొని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-06-26T00:14:18+05:30 IST

కుటుంబ కలహాలతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మోకిల సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఉరేసుకొని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

శంకర్‌పల్లి, జూన్‌ 25 : కుటుంబ కలహాలతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మోకిల సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డికి చెందిన మీసాల మాణిక్యం(48) సంగారెడ్డి లోని రూరల్‌ కోర్టులో విధులు నిర్వహించేవాడు. కాగా, ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మోకిల పోలీ్‌సస్టేషన్‌కు ఆయన ప్రమోషన్‌పై హెడ్‌ కానిస్టేబుల్‌గా వచ్చాడు. ఈక్రమంలో కుటుంబ కలహాలతో సతమతమవుతున్న ఆయన ఆదివారం సంగారెడ్డిలోని నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:14:18+05:30 IST