11క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2023-05-02T23:46:12+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పెద్దేముల్ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఎస్‌ఐ అన్వే్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ నుంఝట మంబాపూర్ వైపు ఆటోలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు.
పెద్దేముల్, మే 2: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పెద్దేముల్ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఎస్‌ఐ అన్వే్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ నుంఝట మంబాపూర్ వైపు ఆటోలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు. ఆటోలో మొత్తం 11క్వింటాళ్ళ రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆటోను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆటోడ్రైవర్ అర్బాజ్‌పై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.