ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2023-10-22T23:31:15+05:30 IST
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ భారతీ హొలికేరి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ భారతీ హొలికేరి
రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 22: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు మంత్రి సబితారెడ్డి, కలెక్టర్ భారతీ హొలికేరి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను సోమవారం ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ దసరా పండుగ అందరికీ విజయాలు చేకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని కోరుటుంటున్నట్లు వారు తెలిపారు. ప్రజలకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళా ఉండాలని, అన్ని వర్గాలవారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అభిలషించారు.