సింగరేణిలో ఎర్రజెండా ఎగరడం సంతోషం
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:52 PM
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి అన్నారు.
చేవెళ్ల, డిసెంబరు 28 : సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల తర్వాత ఏఐటీయూసీకి కార్మికులు పట్టం కట్టడం సంతోషకరమన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు భవిష్యత్‌లో కార్మికులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి శివ, సహాయ కార్యదర్శి మక్బూల్, నాయకులు మంజుల, విజయమ్మ, యాదమ్మ, అనసూయ, స్వరూప, యాదగిరి, ఆనంద్, సత్యనారాయణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.