ఘనంగా రామానుజన్ జయంతి
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:58 PM
గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను శుక్రవారం వివిధ పాఠశాలు, కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 22: గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను శుక్రవారం వివిధ పాఠశాలు, కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గణిత శాస్త్ర వేత రామానుజన్ జయంతిని సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల కార్యదర్శి జె.త్రిశూల్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాలను శాసించే సత్తా గణిత శాస్త్రానికి ఉందన్నారు. రామానుజన్ గణిత శాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు కనుగొన్న మహనీయుడన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లోకనాథం, చైర్మన్ జె.నర్సింహారెడ్డి, విభాగాధిపతి ప్రొఫెసర్ సాయికిరణ్మయి. కన్వీనర్లు సంధ్యారాణి, మహేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవవిధంగా మేడ్చల్ పట్టణంలోని న్యూలిటిల్ లిల్లి పాఠశాలలో విద్యార్ధులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రతిభ కనపరిచారు. వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాంతి, గణిత ఉపాధ్యాయులు సునత, గీత, శ్రవంతి పాల్గొన్నారు.
పరిగి: స్థానిక సుదీక్ష స్కూల్(ఐవీఎ్‌స)లో రామానుజన్ జయంతి సందర్భంగా శుక్రవారం గణితశాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలలో గణిత మేళాను నిర్వహించారు. విద్యార్థులతోగణిత పరికరాల అకారాలను విద్యార్థులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వీరేష్, ప్రిన్సిపాల్ పరిమళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొడంగల్: కొడంగల్‌లోని అక్షర హైస్కూల్‌లో శుక్రవారం విద్యార్థులు గణిత శాస్త్ర, స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సత్యనారాయణయాదవ్ ఉన్నారు.
పరిగి: రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పరిగి ఎంఈవో హరిశ్చందర్ అన్నారు. రామానుజన్ జయంతి సందర్భంగా పరిగిలోని జడ్పీహెచ్‌ఎ్‌సనెం.01 పాఠశాలలో శుక్రవారం గణిత దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం గోపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: కొడంగల్‌లోని నవీన ఆదర్శ కాన్వెంట్ పాఠశాలలో శుక్రవారం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాసరామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణిత మేళా నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందించారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ శంకర్‌నాయక్, వైస్‌ప్రిన్సిపాల్ సంతోష పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: మండలంలోని రావులపల్లి జడ్పీ హెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహ ఇంచారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపన్యాసం, పాటలు, కవితలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శ్యామలమ్మ, ఉపాధ్యాయులు అనంతలక్ష్మి, ముత్యప్ప, సత్యగీత, నరేందర్, అంజ్యనాయక్, శుక్లాదేవి పాల్గొన్నారు.
బొంరా్‌సపేట్: దుద్యాల మండల కేంద్రాల్లోని రెయిన్‌బో, నేతాజీ విద్యానికేతన్ పాఠశాలల్లో శుక్రవారం గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు గణితశాస్త్రంపై క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్వేత, రఘు, హైమద్, అన్వర్, శ్యామ్, పార్వతి, స్వరూప, కవిత, యాదమ్మ, శ్రీవాణి పాల్గొన్నారు.