ఈదురు గాలులు.. విరిగిన పడిన చెట్లకొమ్మలు

ABN , First Publish Date - 2023-06-07T23:45:36+05:30 IST

మండల పరిధిలోని వేముల్‌నర్వ-చింతకుంటపల్లి మార్గంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు రోడ్డు పక్కన ఉన్న చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.

ఈదురు గాలులు.. విరిగిన పడిన చెట్లకొమ్మలు
చింతకుంటపల్లి మార్గంలో విరిగిన పడిన చెట్ల కొమ్మలు

కేశంపేట, జూన్‌ 7: మండల పరిధిలోని వేముల్‌నర్వ-చింతకుంటపల్లి మార్గంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు రోడ్డు పక్కన ఉన్న చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. హరితహారంలో భాగంగా రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చెట్లకొమ్మలు తొలగించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-07T23:45:36+05:30 IST