ఘనంగా కార్తీక పూజలు
ABN , First Publish Date - 2023-12-10T23:02:50+05:30 IST
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చందిప్పలో గల మరకత శివలింగ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన,లక్ష తులసి అర్చన నిర్వహించారు.
శంకర్‌పల్లి, డిసెంబరు 10: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చందిప్పలో గల మరకత శివలింగ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన,లక్ష తులసి అర్చన నిర్వహించారు. కాలభైరవ స్వామికి రుద్రాభిషేకం, శ్రీశైలం అడవుల నుంచి తెచ్చిన 108 రకాల వనమూలికలతో మూలికాభిషేకం, వెయ్యి లీటర్లతో పంచామృతాభిషేకం, క్వింటా పసుపుకుంకుమతో గౌరీశంకర అభిషేకం, 100 కిలోల బూడిదతో భస్మాభిషేకం, 200కిలోల ఫలాభిషేకం, సువర్ణాభిషేకం, కోటి పుష్పాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. 11వ శతాబ్దంలో చాణుక్యులు ప్రతిష్ఠించిన బ్రహ్మసుత్రం గల మరకత శివలింగానికి రకరకాల అభిషేకాలు చేయడం పూర్వజన్మ సుక్రుతం అని భక్తులు అన్నారు. సాయంత్రం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించింది. మధ్యాహ్నం అన్నదానాన్ని నిర్వహించింది. పూజల్లో చైర్మన్ సదానందంగౌడ్, దయాకర్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.