ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2023-03-25T23:57:32+05:30 IST

మండలంలోని కుర్మిద్ద గ్రామంలో శనివారం శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
యాచారం : గణపతి హోమంలో పాల్గొన్న గ్రామస్తులు

యాచారం, మార్చి 25 : మండలంలోని కుర్మిద్ద గ్రామంలో శనివారం శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు అమ్మవారిని గ్రామం నుంచి ఆలయం వరకు భజనలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ఊరేగించి గణపతి హోమం, మంత్రపుష్పం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. సర్పంచ్‌ రాజశేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నర్సింహయాదవ్‌, ముదిరాజ్‌ నాయకుడు శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు నిరంజన్‌రెడ్డిలున్నారు.

ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు

షాబాద్‌ : మండలంలోని మల్లారెడ్డిగూడలో మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళుతుండగా.. శివసత్తుల పూనకాలు, బోతురాజుల విన్యాసాలు అలరించాయి. యువకుల కేరింతలతో బోనాలు, తొట్టెల ఊరేగింపు జరిగింది. గ్రామస్తులంతా పోచమ్మ తల్లిని ఊరువాడా చల్లగా సూడు తల్లీ.. వర్షాలు కురిపించి సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని కోరారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సర్పంచ్‌ జంగయ్య, గ్రామస్తులు గోవర్దన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, గణే్‌షగౌడ్‌, తదితరులున్నారు.

కనుల పండువగా బుగ్గరామేశ్వర స్వామి పల్లకీసేవ

షాబాద్‌ : మండల పరిధిలోని కొమరబండ గ్రామంలో శ్రీ బుగ్గరామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అగ్నిగుండం, పల్లకీసేవ తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లకీ సేవలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈవో శ్రీనివాసులు, సర్పంచ్‌ చంద్రశేఖర్‌, మాజీ సర్పంచ్‌ దేవెందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

ఆమనగల్లు : నల్లవారిపల్లి గ్రామంలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పుచ్చటి తోరణాలు, పుష్పాలతో అలంకరించారు. శనివారం దివంగత ఇటికాల రవీందర్‌రెడ్డి స్మారకార్థం ఆయన కుమారుడు విక్రమ్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2023-03-25T23:57:32+05:30 IST