ఘనంగా మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2023-05-31T23:55:25+05:30 IST

మండల పరిధిలోని వేముల్‌నర్వ గ్రామంలో మైసమ్మ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈమేరకు బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

కేశంపేట/శంకర్‌పల్లి, మే 31: మండల పరిధిలోని వేముల్‌నర్వ గ్రామంలో మైసమ్మ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈమేరకు బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలను సల్లంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సర్పంచ్‌ మంజుల మల్లేష్‌ యాదవ్‌ మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు. వైస్‌ ఎంపీపీ అనురాధ పర్వత్‌రెడ్డి, రాజశేఖర్‌ గుప్తా, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, రమేష్‌, శ్రీధర్‌గౌడ్‌, పెద్ద నర్సింలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు బుధవారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, కేరళలోని శబరిలో గల అయ్యప్ప స్వామి దేవాలయం మాదిరిగానే సుమారు రూ.11కోట్ల తో ఆలయాన్ని నిర్మించారు. 240 కిలోల పంచలోహాలతో విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. నేడు నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు కోరారు. పూజా కార్యక్రమాలు జూన్‌ 5వరకు కొనసాగుతాయని తెలిపారు.

Updated Date - 2023-05-31T23:55:25+05:30 IST