రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ప్రాణసంకటం!

ABN , First Publish Date - 2023-05-27T00:00:16+05:30 IST

రోడ్లపైన ధాన్యం ఎండబోస్తే వాహనదారులకు ప్రమాదమని తెలిసీ కొందరు రైతులు నిర్లక్ష్యంగా రోడ్లపైనే ధాన్యాన్ని ఎండబోస్తున్నారు.

రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ప్రాణసంకటం!
అల్వాల సమీపంలో రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు

ప్రమాదమని తెలిసినారోడ్డుపైనే మొక్కజొన్నల ఆరబోత

కేశంపేట, మే 26: రోడ్లపైన ధాన్యం ఎండబోస్తే వాహనదారులకు ప్రమాదమని తెలిసీ కొందరు రైతులు నిర్లక్ష్యంగా రోడ్లపైనే ధాన్యాన్ని ఎండబోస్తున్నారు. అల్వాల గ్రామ సమీపంలోని కొత్తపేట-షాద్‌గనర్‌ రాహదారిపై ఓ రైతు రెండు రోజులగా మొక్కజొన్నలు ఆరబోస్తున్నాడు. డబుల్‌ రోడ్డు కావడంతో వాహనచోదకులు కొంతవేగంగా వెళ్తున్నారు. రోడ్డుపై ఎండబోసిన మొక్కజొన్నలపైనుంచి వాహనం వెళ్తే జారి పట్టుతప్పడం ఖాయం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ఇలాంటి పరిస్థితి ప్రాణ సంకటం. ఈ దృష్ట్యా రోడ్లపై ధ్యాన్యాన్ని ఆరబోయొద్దని అధికారులు మొత్తుకుంటున్నా రైతులు వినడం లేదు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై ధాన్యం ఆరబోసిన వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-27T00:00:16+05:30 IST