జీపీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2023-03-05T00:21:20+05:30 IST

పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్‌ అన్నారు.

జీపీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలి
యూజీడీ పనులను పరిశీలిస్తున్న డీపీవో తరుణ్‌కుమార్‌

కులకచర్ల, మార్చి 4: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్‌ అన్నారు. శనివారం కామునిపల్లిలో ఆయన పర్యటించారు. యూజీడీ పనులను, పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, నర్సరీలను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌లో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తడి, పొడి చెత్తతో యార్డులో కంపోస్టు ఎరువు తయారు చేయించాలన్నారు. డంపింగ్‌యార్డును ఉపయోగించకుంటే సెక్రటరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగవేణి, ఎంపీవో కరీం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:21:20+05:30 IST