ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2023-05-31T23:06:38+05:30 IST

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్‌, ఉద్దేమర్రి, అద్రా్‌సపల్లి, జగ్గంగూడ గ్రామాల్లో రూ. 62.65 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మూడుచింతలపల్లి మండలంలో అభివృద్ధి పనుకలు శంకుస్థాపన చేస్తున్న మంత్రి మల్లారెడ్డి

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

మూడుచింతలపల్లి/కీసర రూరల్‌, మే 31 : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్‌, ఉద్దేమర్రి, అద్రా్‌సపల్లి, జగ్గంగూడ గ్రామాల్లో రూ. 62.65 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని అన్నారు. అనంతరం లక్ష్మాపూర్‌ గ్రామంలోని శ్రీ రాముల గుట్టలో శ్రీ సీతారామ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హారికమురళీగౌడ్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనీవా్‌సరెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా శామీర్‌పేట మండలం తుర్కపల్లి సీసీరోడ్లు, డ్రైనేజీ, నూతనబస్టాప్‌, ఎస్సీ కమ్యూనిటీహాల్‌, మార్కెట్‌యార్డు, తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుబాయి, జడ్పీటీసీ అనిత, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, వైస్‌ఎపీపీ ఎల్లు సుజాత, సర్పంచ్‌ కవితవేణుగోపాల్‌రెడ్డి, జహంగీర్‌, సుదర్శన్‌, జహీరుద్దీన్‌ పాల్గొన్నారు. కాగా ఆలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో చేపట్టిన కనకదుర్గ ఆలయ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వసుపతిప్రణీత, వైస్‌చైర్మన్‌ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉద్దెమర్రిలో మంత్రికి నిరసన సెగ

ఉద్దెమర్రి గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపస చేయడానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామంలోని పెద్దమ్మతల్లి కాలనీలో సుమారు 40 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆకాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీ వ్వవస్థ లేదని, ఒక్కరి ఇంటి కోసం సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం ఏంటని మంత్రిని ప్రశ్నించారు. మంత్రి రూ.5 లక్షలు మంజూరు చేసి ప్రజాధనం వృథా చేస్తూ ప్రతినిధులకు అప్పనంగా అంటగడుతున్నారని మండిపడ్డారు. పాలకులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయకుండా తమ సొంత పనుల కోసం పైరవీలు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-31T23:06:38+05:30 IST